మంచు లక్ష్మి: స్కూల్లో కేక్ కోసి ఒకరోజు ముందే పుట్టిన రోజు జరుపుకున్న మంచు లక్ష్మి.. వీడియో

  • అప్పుడే బర్త్ డే సంబరాలు మొదలయ్యాయంటూ లక్ష్మి ట్వీట్
  • టీచ్‌ ఫ‌ర్‌ ఛేంజ్ సంస్థ‌ ఆధ్వర్యంలో పుట్టినరోజు సంబరం
  • మంచు లక్ష్మికి శుభాకాంక్షలు తెలిపిన చిన్నారులు
  • రేపు మంచు లక్ష్మి పుట్టిన రోజు

సినీనటి, నిర్మాత మంచు లక్ష్మి స్కూలు పిల్లల మధ్య బర్త్ డే కేక్ కోసి తన జన్మదినాన్ని ఒకరోజు ముందుగానే చేసుకుంది. అక్టోబర్ 8 (రేపు) న ఆమె పుట్టిన రోజు ఉంది. అయితే, కిడ్స్ తో అప్పుడే బర్త్ డే సంబరాలు మొదలయ్యాయంటూ ఆమె ట్వీట్ చేసింది. తాను కేక్ కట్ చేస్తుండ‌గా తీసిన వీడియోను త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసింది. చిన్నారుల మ‌ధ్య‌ త‌న పుట్టిన రోజు వేడుక‌ను జ‌రిపినందుకు టీచ్‌ ఫ‌ర్‌ ఛేంజ్ సంస్థ‌కు ధ‌న్యవాదాలు తెలుపుతున్న‌ట్లు పేర్కొంది. మంచు లక్ష్మికి పుష్ప‌గుచ్ఛాలు అందించి టీచ్‌ ఫ‌ర్‌ ఛేంజ్ సంస్థ నిర్వాహ‌కులు, పిల్లలు శుభాకాంక్ష‌లు తెలిపారు.  

  • Loading...

More Telugu News