బేబీ: కిడ్నాపర్ల నుంచి తనను రక్షించిన హైదరాబాద్ పోలీసుని చూసి నవ్వుతోన్న నాలుగు నెలల చిన్నారి.. అబ్బురపరుస్తోన్న ఫొటో

  • హైదరాబాద్‌లో నాలుగు నెల‌ల చిన్నారి కిడ్నాప్
  • 15 గంటల్లోనే రక్షించిన పోలీసులు
  • తన చుట్టూ ఇంత జరుగుతోన్నా ఏమీ తెలియనితనంతో నవ్విన పసివాడు
  • కిడ్నాపర్లను అరెస్టు చేసిన పోలీసులు

హైదరాబాద్‌లో నాలుగు నెల‌ల చిన్నారి త‌న త‌ల్లి ప‌క్కన నిద్రిస్తుండ‌గానే ఇద్ద‌రు కిడ్నాపర్లు ఆ బాలుడిని ఎత్తుకెళ్లారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ఆ చిన్నారిని 15 గంటల్లోనే కాపాడి, నిందితుల‌ను అరెస్టు చేశారు. పోలీసులు ఆ చిన్నారిని కాపాడి పోలీస్ట్ స్టేష‌న్ వ‌ద్ద‌కు తీసుకురాగానే తీసిన ఓ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. త‌న చుట్టూ ఇంత జ‌రుగుతోంద‌ని తెలియ‌ని ఆ చిన్నారి పోలీసు అధికారిని చూసి న‌వ్వుతున్నాడు.

ఆ చిన్నారిని పోలీసు అధికారి ఎత్తుకోగా ఈ అరుదైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ ప‌సివాడి న‌వ్వుకి పోలీసులు ఫిదా అయిపోయారు. హైద‌రాబాద్ పోలీస్ అధికారిక ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసిన ఈ ఫొటో అంద‌రినీ అల‌రిస్తోంది. కాగా, ఆ చిన్నారిని ఎత్తుకెళ్లిన కిడ్నాప‌ర్ల పేర్లు ఎండీ మ‌స్తాక్‌, ఎండీ యూస‌ఫ్ అని పోలీసులు చెప్పారు.  

  • Loading...

More Telugu News