kcr: అలా మాట్లాడితే... నాకు, కేసీఆర్ కు తేడా ఏముంటుంది?: జానారెడ్డి

  • కేసీఆర్ లా నీచంగా మాట్లాడలేను
  • కేసీఆర్ పట్ల ప్రజల్లో ఆగ్రహం రావాలి
  • టీఆర్ఎస్ ఓటమే.. కేసీఆర్ కు సరైన సమాధానం

టీజేఏసీ ఛైర్మన్ కోదండరామ్ ను 'వాడు, వీడు' అంటూ మాట్లాడిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మండిపడ్డారు. తెలంగాణ కేసీఆర్ వల్ల మాత్రమే రాలేదని... ఎంతోమంది త్యాగం, పోరాటం దీని వెనుక ఉన్నాయని అన్నారు. తెలంగాణ జేఏసీకి అప్పట్లో అందరం కలిసే పేరు పెట్టామని చెప్పారు.

మీడియా సమావేశంలో కేసీఆర్ భయంతో మాట్లాడినట్టు అనిపిస్తోందని అన్నారు. కేసీఆర్ లా తాను నీచంగా మాట్లాడలేనని... అలా మాట్లాడితే కేసీఆర్ కు, తనకు తేడా ఏముంటుందని చెప్పారు. కేసీఆర్ వ్యవహారశైలి పట్ల ప్రజల్లో ఆగ్రహం రావాలని... అప్పుడు వారు సంధించే ప్రశ్నలకు కేసీఆర్ సమాధానాలు చెప్పాలని అన్నారు. కేసీఆర్ లా మాట్లాడేవారు కాంగ్రెస్ లో కూడా పుట్టుకొస్తారని అన్నారు. 

kcr
talangana cm
jana reddy
telangana congress
jana reddy fires on kcr
  • Loading...

More Telugu News