sailaja kiran: గరిటె తిప్పి చాలా కాలమైంది.. ఇప్పుడు అల్లుడి కోసం వండాలనుకుంటున్నా: మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్

  • చిన్నప్పటి నుంచి హాస్టల్ లోనే పెరిగా
  • అమ్మ వంటింట్లోకి రానిచ్చేది కాదు
  • పెళ్లైన తర్వాత బిజినెస్ లో బిజీ అయ్యా
  • అమ్మ చేయడం చూసి, వంట చేయడం నేర్చుకున్నా
  • ఇప్పుడు అల్లుడికి వండి పెడదామనుకుంటున్నా

తాను చిన్నప్పటి నుంచి హాస్టల్ లోనే పెరిగానని... ఇంటికి వెళ్లినప్పుడు అమ్మ తనను వంటింట్లోకి రానిచ్చేది కాదని... వెళ్లి రిలాక్స్ అవ్వు అనేదని 'ఈనాడు' సంస్థల అధినేత రామోజీరావు పెద్ద కోడలు శైలజా కిరణ్ అన్నారు. పెళ్లైన తర్వాత సమయం దొరికితే, ఆఫీసుకు వెళ్లడమే అలవాటయిందని తెలిపారు. కానీ, అమ్మవాళ్లు వంట చేస్తున్నప్పుడు చూసి, వండటం నేర్చుకున్నానని చెప్పారు.

శాకాహార వంటకాలు చేయడం వచ్చని, చికెన్ కూడా చేయగలనని అన్నారు. అయితే, కిచెన్ లో గరిటె తిప్పి చాలా కాలమయిందని... ఇప్పుడు వంట మళ్లీ చేయాలని అనుకుంటున్నానని తెలిపారు. అల్లుడు వచ్చారు కదా... అతనికి వండి పెడదామని కోరికగా ఉందని నవ్వుతూ చెప్పారు. తాను కూడా ఒక అత్తనేనని... అల్లుడికి వండి పెట్టాలన్న కోరిక అందరు అత్తల్లాగే తనకు కూడా ఉందని తెలిపారు. మనం సొంతంగా చేసే వంటలో అనురాగం కూడా కలుస్తుందని అన్నారు. వెబ్ చానల్ ఐడ్రీమ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలను వెల్లడించారు.

sailaja kiran
eenadu kiran
margadarsi md sailaja kiran
sailaja kiran marriage
ramojirao
  • Loading...

More Telugu News