murder: 'జిందాల్ ఆయిల్ మిల్స్' కుటుంబానికి చెందిన నలుగురు మహిళలు, సెక్యూరిటీ గార్డ్ హత్య

  • దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఘాతుకానికి పాల్పడ్డ దుండగులు
  • ఆస్తి తగాదాల నేపథ్యంలో తల్లీకూతుళ్లను చంపిన వైనం
  • అడ్డొచ్చిన సెక్యూరిటీ గార్డు కూడా హత్య

ఆస్తి త‌గాదాల కార‌ణంగా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మహిళలను గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు హ‌త్య‌చేసి ప‌రారైన ఘ‌ట‌న దేశ రాజ‌ధాని ఢిల్లీలోని షదర మానస సరోవర్‌ పార్క్ స‌మీపంలో చోటు చేసుకుంది. ఆ మ‌హిళ‌లు ఉంటోన్న ఇంటికి సెక్యూరిటీ గార్డుగా ఉన్న రాకేశ్‌ను కూడా దుండ‌గులు చంపేశారు. మృతుల‌ను ఉర్మిళ జిందాల్ (82), ఆమె కూతుళ్లు సంగీత గుప్తా (56), నుపుర్‌ (48), అంజలి (38)గా పోలీసులు గుర్తించారు.

ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసు‌కున్న పోలీసులు ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు. సన్నిహితులమ‌ని చెప్పుకుని వారింట్లోకి ప్ర‌వేశించిన దుండ‌గులు... ఈ హ‌త్య‌లు చేసిన‌ట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

 ఈ ఘ‌ట‌న‌పై షాహ‌ద‌రా డిప్యూటీ క‌మిష‌న‌ర్ నుపుర్ ప్ర‌సాద్ మాట్లాడుతూ... ఈ కేసులో ద‌ర్యాప్తు ప్రారంభించామ‌ని, హ‌త్య‌కు గురైన ఉర్మిళ జిందాల్ కుటుంబానికి ఢిల్లీలో జిందాల్ ఆయిల్ మిల్ ఉంద‌ని తెలిపారు. రూ.కోట్లు విలువ‌చేసే ఓ ప్లాట్‌ను ఇటీవ‌ల ఆ కుటుంబం అమ్మేసింద‌ని, అది కూడా వివాదానికి కారణమైందని  చెప్పారు. ఈ కేసును అన్ని కోణాల్లోనూ ద‌ర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఫోరెన్సిక్, క్రైమ్ ద‌ర్యాప్తు బృందాలు ఆధారాలు సేక‌రిస్తున్నాయ‌ని అన్నారు.  

  • Loading...

More Telugu News