sailaja kiran: కొడుకు లేని లోటుపై మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ స్పందన!

  • ఒక్క బాబు ఉంటే బాగుండేదని అనిపిస్తుంటుంది
  • ఈ విషయం గురించి మాట్లాడితే.. మా అమ్మాయిలకు కోపం వస్తుంది
  • అమ్మాయిల కంటే అబ్బాయిలు ఎక్కువేం కాదు

ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు పెద్ద కుమారుడు కిరణ్ దంపతులకు ముగ్గురూ అమ్మాయిలే. ఇదే విషయమై కిరణ్ సతీమణి శైలాజ కిరణ్ ను వెబ్ చానల్ ఐడ్రీమ్ ప్రశ్నించింది. ఒక్క కొడుకు ఉంటే బాగుండునని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అని ప్రశ్నించగా... శైలజ ఆసక్తికర సమాధానం ఇచ్చారు.

ఒక్క బాబు ఉంటే బాగుండేదేమోనని అప్పడప్పుడు అనిపిస్తుంటుందని ఆమె అన్నారు. బాబు ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటుందేమో అనే భావన కలుగుతుంటుందని చెప్పారు. తాను, తన కుమార్తెలు కలసి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఊహించని విధంగా కారు ఆగిపోతే... ఏదో భయం కలుగుతుందని... ఆ సమయంలో బాబు ఉంటే ధైర్యంగా ఉంటుందని ఆమె అన్నారు.

అయితే, ఈ విషయం గురించి మాట్లాడితే మా అమ్మాయిలకు కోపం వస్తుందని... 'అమ్మాయిలైతే ఏం తక్కువమ్మా' అంటుంటారని తెలిపారు. ముఖ్యంగా మా రెండో అమ్మాయి ఎక్కువ కోప్పడుతుందని నవ్వుతూ చెప్పారు. తన ఉద్దేశం అమ్మాయిలకన్నా అబ్బాయిలు ఎక్కువ అనేది కాదని స్పష్టం చేశారు. అన్ని రంగాల్లోను అబ్బాయిలు, అమ్మాయిలు సమానంగానే రాణిస్తున్నారని చెప్పారు. 

sailaja kiran
eenadu kiran
margadarsi md sailaja kiran
sailaja kiran marriage
ramojirao
  • Loading...

More Telugu News