Rajinikanth: త్వరలో హిమాలయాలకు రజనీకాంత్?

  • కీలక నిర్ణయాలకు ముందు హిమాలయాలకు వెళ్లడం అలవాటు
  • త్వరలోనే రాజకీయ అరంగేట్రంపై స్పష్టత వచ్చే అవకాశం
  • కోడై కూస్తున్న కోలీవుడ్

జీవితంలో కీలక నిర్ణయాలు తీసుకునే ముందు హిమాలయాలకు వెళ్లడాన్ని అలవాటుగా మార్చుకున్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అతి త్వరలో హిమాలయాలకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు సన్నాహాలు కూడా చేసుకున్నట్టు సమాచారం. రజనీకాంత్ రాజకీయాల్లోకి రానున్నట్టు ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. దేవుడు ఆదేశిస్తే వస్తానని ఆయన కూడా స్వయంగా ప్రకటించారు.

ఈ నేపథ్యంలోనే ఆయన హిమాలయాలకు వెళ్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. హిమాలయాల్లో ధ్యానం చేసి వచ్చిన తర్వాత రాజకీయ రంగ ప్రవేశంపై రజనీకాంత్ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో తమిళ రాజకీయాల్లో మారోమారు వేడి మొదలైంది. మరోవైపు మరో నటుడు కమల హాసన్ కూడా తన రాజకీయ అరంగేట్రం గురించి స్పష్టమైన వైఖరి తెలియజేసిన సంగతి తెలిసిందే.

Rajinikanth
tamilnadu
politics
himalayas
  • Loading...

More Telugu News