koratala: మహేశ్ ఫోటో లీక్ .. ఆ ఫొటో సర్క్యులేట్ చేయద్దంటోన్న కొరటాల!

  •  షూటింగు దశలో 'భరత్ అను నేను'
  •  ముఖ్యమంత్రి పాత్రలో మహేశ్ బాబు
  •  అందుకు సంబంధించిన ఫొటో లీక్
  •  సర్క్యులేట్ చేయవద్దంటున్న కొరటాల  

కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్ అను నేను' సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ సినిమా హైదరాబాద్ లో ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. మరో షెడ్యూల్ కోసం ఈ సినిమా టీమ్ విదేశాలకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి మహేశ్ బాబు ఫోటో ఒకటి లీక్ అయింది. ఈ సినిమాలో మహేశ్ బాబు .. ముఖ్యమంత్రిగా కనిపించనున్నాడు. దాంతో ముఖ్యమంత్రిగా ఆయన లుక్ ఎలా వుండనుందోననే ఆసక్తి అందరిలో రేకెత్తుతూ వస్తోంది.

ఈ క్రమంలో మహేశ్ బాబు ముఖ్యమంత్రిగా వున్న ఫొటో ఒకటి లీకై .. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాంతో ఈ సినిమా యూనిట్ అప్రమత్తమైంది. "అభిమానులకు మంచి చిత్రాన్ని అందించేందుకు మేం కృషి చేస్తున్నాం .. దయచేసి ఎవరూ ఈ ఫొటోను సర్క్యులేట్ చేయవద్దు" అంటూ సోషల్ మీడియా ద్వారా కొరటాల కోరారు. ఆయన అభ్యర్థనను నెటిజన్లలో ఎంతమంది అర్థం చేసుకుంటారనేదే సందేహం.   

  • Loading...

More Telugu News