hyd: హైద‌రాబాద్‌లో రోడ్లు ఊడ్చిన‌ ‘మ‌హానుభావుడు’ సినిమా బృందం.. వీడియో ఇదిగో!

  • శర్వానంద్, మారుతి కాంబినేషన్ లో వచ్చిన ‘మ‌హానుభావుడు’
  • శ్రీన‌గ‌ర్ కాల‌నీలో ‘స్వ‌చ్ఛతా హి సేవ’ కార్యక్రమంలో పాల్గొన్న సినిమా యూనిట్
  • ‘మ‌హానుభావుడు’ సినిమాలో అతిశుభ్రత పాటించే హీరో

శర్వానంద్, మెహ్రీన్ పిర్జాదా, నాజర్, వెన్నెల కిషోర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో దర్శకుడు మారుతి తెర‌కెక్కించిన ‘మ‌హానుభావుడు’ చిత్రానికి ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న వ‌స్తోన్న విష‌యం తెలిసిందే. ఈ క్రమంలో ఈ సినిమా బృందం అంతా క‌లిసి హైద‌రాబాద్‌లోని శ్రీన‌గ‌ర్ కాల‌నీలో ఈ రోజు ‘స్వ‌చ్ఛతా హి సేవ’ కార్య‌క్ర‌మంలో పాల్గొని రోడ్లు ఊడ్చారు. ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకోవాల‌ని స్వ‌చ్ఛ‌భార‌త్‌లో పాల్గొనాల‌ని సందేశం ఇచ్చారు.

గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ స్వ‌చ్ఛ భార‌త్ కి అనుబంధంగా ‘స్వ‌చ్ఛ‌తా హి సేవ’ అనే కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన విష‌యం తెలిసిందే. దేశంలోని ప్ర‌ముఖులకు ఆయన ఇటీవ‌ల లేఖ‌లు రాసి ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనాల‌ని సందేశం ఇచ్చారు. ‘మ‌హానుభావుడు’ సినిమాలో హీరో శుభ్రతను మోతాదుకి మించి పాటించి కడుపుబ్బా నవ్విస్తాడు.  

hyd
  • Loading...

More Telugu News