smart phone: స్మార్ట్‌ఫోన్‌లో ఆధార్... `ఎం ఆధార్` యాప్‌తో సాధ్యం
- ఒక్క టచ్‌తో ఆధార్ వివరాలు
- ప్లే స్టోర్‌లో యాప్
- ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే
ఈ మధ్య ఆధార్ లేకుండా ఏ పని కావడం లేదంటే అతిశయోక్తి కాదు. పరీక్షకు వెళ్లినా, ప్రభుత్వ పనుల కోసం వెళ్లినా ఆధార్ తప్పనిసరిగా మారింది. అందుకోసం ఎప్పుడూ ఆధార్‌ని జేబులో పెట్టుకుని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఆ అవసరం లేదు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) విడుదల చేసిన `ఎం ఆధార్` యాప్ ద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆధార్ వివరాలు తెలుసుకునే సదుపాయం ఏర్పడింది.
గూగుల్ ప్లేస్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో యూజర్‌నేమ్, పాస్వర్డ్ సృష్టించుకుని వాటి ద్వారా లాగిన్ అవ్వాలి. లేదంటే మీ ఆధార్ మీద ఉన్న క్విక్ రెస్పాన్స్ (క్యూఆర్) కోడ్‌ను స్కాన్ చేస్తే దానంతట అదే వివరాలను సేకరించుకుంటుంది. ఈ యాప్ ప్రస్తుతం కేవలం ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది.