స్మిత్: ప్రాక్టీస్ మ్యాచ్ ఆడిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్‌ భుజానికి గాయం

  • రేప‌టి నుంచి టీ20 మ్యాచులు ప్రారంభం 
  • గాయం తీవ్రత త‌క్కువ‌గానే ఉంద‌ని తేల్చిన వైద్యులు
  • రేపు రాంచీలో జరగనున్న టీ 20 ఆడ‌తాడని ప్ర‌క‌టన
  • ఆసీస్, టీమిండియా మధ్య మొత్తం 3 టీ20 మ్యాచ్ లు

భార‌త ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆస్ట్రేలియా జ‌ట్టు 4-1 తేడాతో ఇప్ప‌టికే వ‌న్డే సిరీస్‌ను కోల్పోయిన విష‌యం తెలిసిందే. రేప‌టి నుంచి టీ20 మ్యాచులు ప్రారంభం కానున్న నేప‌థ్యంలో ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌కు గాయమైంది. నిన్న ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోన్న నేప‌థ్యంలో స్మిత్‌ భుజానికి గాయంకాగా ఆయ‌న‌ను మేనేజ్‌మెంట్‌ సిబ్బంది వెంట‌నే ఆసుప‌త్రికి తీసుకెళ్లారు.

వైద్య‌ ప‌రీక్ష‌లు నిర్వ‌హించి గాయం తీవ్రత త‌క్కువ‌గానే ఉంద‌ని తేల్చారు. దీంతో ఆయ‌న రేప‌టి టీ 20 ఆడ‌తాడని ప్ర‌క‌టించారు. అస‌లే ఒత్తిడిలో ఉన్న ఆసీస్‌.. స్మిత్ ఆడ‌క‌పోతే మ‌రింత ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వచ్చేది. కాగా, మొద‌టి టీ20 మ్యాచ్ రాంచీలో జరగనుంది. ఆసీస్, టీమిండియా మధ్య మొత్తం 3 టీ20 మ్యాచ్ లు జరుగుతాయి. 

  • Loading...

More Telugu News