pakistan: మీ మేలు కోరి చెబుతున్నాం... ఇకనైనా మారండి: పాకిస్థాన్ కు యూఎస్ వార్నింగ్

  • ఉగ్రమూలాలు ఎక్కడున్నా ఉపేక్షించబోము
  • పాక్ తన వైఖరి మార్చుకోవాలి
  • లేకుంటే కఠిన చర్యలు తప్పవు
  • యూఎస్ విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్ 

ఉగ్రవాదులకు సాయపడటాన్ని పాకిస్థాన్ ఇప్పటికైనా వదిలివేయాలని అమెరికా వ్యాఖ్యానించింది. పాక్ మేలు కోరి ఈ మాటలు చెబుతున్నామని, ప్రపంచ శాంతి విఘాతానికి కారణమవుతున్న ఉగ్ర మూలాలు ఎక్కడ ఉన్నాయని తెలిసినా ఉపేక్షించబోమని అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్ వ్యాఖ్యానించారు. ఇకనైనా పాక్ మారాలని హితవు పలికారు.

 పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఖావాజా ఆసిఫ్ తో సమావేశమైన అనంతరం టిల్లర్సన్ మీడియాతో మాట్లాడారు. తాను ఖావాజాతో సమావేశానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూశానని, ఆయన నోటి నుంచి ఉగ్ర నిరోధక చర్యల గురించిన మాటలు వస్తాయని భావించానని, కానీ, ఖావాజా ఆ ప్రస్తావనే తేలేదని టిల్లర్సన్ వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం పాక్ వైఖరి మారుతుందని ఎంతో ఓర్పుతో వేచి చూస్తోందని, అలా కుదరదని భావిస్తే, చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

పాకిస్థాన్ లో సైన్యం, ప్రజా ప్రతినిధుల మధ్య అంతరం పెరిగిపోతూ ఉండటం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. పాకిస్థాన్ తో తాము మంచి స్నేహబంధాన్నే కోరుతున్నామని, అయితే, ఒక్క ఉగ్రవాది కూడా తమ భూభాగంపై లేకుండా చూడాల్సిన బాధ్యత పాక్ దేనని అన్నారు.

  • Loading...

More Telugu News