allu arjun: మరో కొత్త డైరెక్టర్ కి ఛాన్స్ ఇస్తోన్న అల్లు అర్జున్!

  •  వక్కంతం వంశీకి డైరెక్టర్ గా ఛాన్స్ ఇచ్చిన బన్నీ
  •  మరో కొత్త దర్శకుడికి కూడా అవకాశం ఇచ్చినట్టు టాక్
  •  ఆ దర్శకుడితో లవ్ స్టోరీ చేయడానికి రెడీ
  •  లింగుస్వామి మూవీకి ముందా .. తరువాత అనేది తెలియాల్సి  వుంది  

ప్రస్తుతం అల్లు అర్జున్ 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' అనే సినిమా చేస్తున్నాడు. ఈ మధ్యనే సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమా, చకచకా షూటింగును కానిచ్చేస్తోంది. ఈ సినిమాతో వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ క్రమంలో మరో కొత్త దర్శకుడికి కూడా బన్నీ ఛాన్స్ ఇచ్చాడనే టాక్ ఇప్పుడు ఫిల్మ్ నగర్లో జోరుగా షికారు చేస్తోంది.

ఓ కొత్త దర్శకుడు ఇటీవల అల్లు అర్జున్ ను కలిసి ఒక లవ్ స్టోరీని వినిపించాడట. ఆ లవ్ స్టోరీ కొత్తగా ఉండటం .. ఆ తరహా పాత్రను తాను ఇంతవరకూ చేసి ఉండకపోవడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని సమాచారం. వరుసగా యాక్షన్ కంటెంట్ ఎక్కువగా వున్న కథలను చేస్తూ వస్తోన్న అల్లు అర్జున్, కొత్తదనం కోసమే ఈ లవ్ స్టోరీకి ఓకే చెప్పాడని అంటున్నారు.

అయితే, ప్రస్తుతం తాను చేస్తోన్న 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' తరువాత లింగుస్వామితో కలిసి బన్నీ సెట్స్ పైకి వెళతాడా? లేదంటే కొత్త దర్శకుడితో లవ్ స్టోరీ చేస్తాడా? అనేది చూడాలి.      

  • Loading...

More Telugu News