naga: మా వాడిని పెళ్లికొడుకును చేశామంటూ నాగ్, వెంకీ షేర్ చేసుకున్న ఫోటో ఇది!

  • అక్కినేని వారింట పెళ్లి సందడి
  • నేడు హీరోయిన్ సమంతతో వివాహం
  • మధ్యలో చైతూ, అటూ ఇటూ నాగ్, వెంకీ
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫోటో

అక్కినేని వారింట పెళ్లి సందడి జోరందుకుంది. ఈ ఉదయం తన కుమారుడు నాగచైతన్యను పెళ్లి కొడుకును చేసిన అనంతరం తీసిన ఫోటోను నాగార్జున అభిమానులతో పంచుకున్నారు. మధ్యలో పెళ్లికొడుకుగా చైతూ నిలబడగా, అటూ ఇటూ నాగార్జున, వెంకటేష్ నిలబడి ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్.

నేటి మధ్యాహ్నం తరువాత మెహందీతో వివాహ తంతు మొదలు కానుండగా, రాత్రికి హిందూ సంప్రదాయంలో, రేపు సాయంత్రం క్రైస్తవ సంప్రదాయంలో చైతూ, సమంతల పెళ్లి జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉదయం 9.17కు నాగ్ ఈ ఫోటోను షేర్ చేయగా, అది వేలకొద్దీ లైక్స్ తెచ్చుకుంది. నాగార్జున షేర్ చేసిన ఆ ఫోటోను మీరూ చూడవచ్చు.

  • Loading...

More Telugu News