Bangalore: జర్నలిస్టును లైంగికంగా వేధించిన హోటల్ సెక్యూరిటీ గార్డులు...శశిథరూర్ ఇంటర్వ్యూ సందర్భంగా ఘటన

  • బెంగళూరు వచ్చిన శశి థరూర్
  • శశి థరూర్ ను ఇంటర్వ్యూ చేసేందుకు వెళ్లిన మహిళా జర్నలిస్టు
  •  ఒళ్లంతా తడిమి, దాడి చేసిన సెక్యూరిటీ గార్డులు

మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ ను ఇంటర్వ్యూ చేసేందుకు వెళ్లిన మహిళా జర్నలిస్టును ముగ్గురు సెక్యూరిటీ గార్డులు వేధించిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన వివరాల్లోకి వెళ్తే... గత సెప్టెంబర్‌ 27న శశిథరూర్‌ బెంగళూరు వచ్చి ఒక హోటల్‌ లో దిగారు.

దీంతో ఆయనను ఇంటర్వ్యూ చేసేందుకు అనుమతి తీసుకున్న ఒక టీవీ ఛానెల్ కు చెందిన మహిళా జర్నలిస్టు ఆ హోటల్‌ కు చేరుకున్నారు. అయితే హోటల్ ముందున్న సెక్యూరిటీ సిబ్బంది ఆమెను తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. తనిఖీ పేరుతో ఆమె ఒళ్లంతా తడిమారు. ఒకదశలో ఆమె వారి ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో చేయి కూడా చేసుకున్నారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, వారిలో వేలాయుధన్ అనే సెక్యూరిటీ గార్డును అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరిని అరెస్టు చేయాల్సి ఉంది. 

Bangalore
sashi tharur
journalist
journalist harassed
  • Loading...

More Telugu News