hema: ఒళ్లు కొవ్వెక్కిందా వాళ్లకి?: వెబ్‌సైట్లలో రాత‌ల‌పై సినీ న‌టి హేమ‌

  • వెబ్‌సైట్ల నిర్వాహ‌కులు బూతులు రాస్తున్నారు
  • అలాగే, ఫేస్‌బుక్‌లోనూ మార్ఫింగ్ చేసి ఫొటోలు పెడుతున్నారు
  • కేవలం సినిమావారి మీదే కాదు.. అందరిపైనా ఇటువంటివి వస్తున్నాయి

త‌మ‌ భార్యాపిల్ల‌ల్ని పోషించుకోవ‌డానికి వెబ్‌సైట్ల నిర్వాహ‌కులు అందులో బూతులు రాస్తున్నారని సినీ న‌టి హేమ అన్నారు. న‌టుల‌పై వ‌స్తోన్న గాసిప్స్‌పై మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన హేమ‌... ఫేస్‌బుక్‌లో మార్ఫింగ్ చేసి ఫొటోలు పెట్ట‌డం వ‌ల్ల అమ్మాయిలు ఆత్మ‌హ‌త్యలు చేసుకుంటున్నార‌ని అన్నారు. త‌న బాధ సినీన‌టుల గురించి మాత్రమే కాద‌ని, అంద‌రు ఆడ‌వాళ్ల గురించ‌ని తెలిపారు.

ఈ వెబ్‌సైట్ నిర్వాహ‌కులు ఎక్క‌డెక్క‌డో ఉండి వాటిని నిర్వ‌హిస్తుంటారని హేమ చెప్పారు. ‘ఒళ్లు కొవ్వెక్కిందా వాళ్లకి, ఇంటువంటి రాత‌లు రాస్తున్నారు?’ అని ప్ర‌శ్నించారు. చదువుకి సంబంధించిన వాటిని గూగుల్‌లో సెర్చ్ చేస్తే దాని ప‌క్కన ఇది క్లిక్ చేయండంటూ అశ్లీల వీడియోలు, రాత‌లు ఉంటున్నాయ‌ని తెలిపారు. 

  • Loading...

More Telugu News