1 st class student: ఢిల్లీలో మరో కలకలం... స్కూల్లో ఒకటో తరగతి విద్యార్థినిపై వికృత చేష్ట‌

  • ఢిల్లీలోని ర్యాన్ ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్‌లోని ఘటనను మరవక ముందే మరో దారుణం
  • సంత్ నిరంకారి ప‌బ్లిక్ స్కూల్‌లో చిన్నారిపై మృగాడిలా ప్ర‌వ‌ర్తించిన వ్యక్తి
  • నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు

ఇటీవల ఢిల్లీలోని ర్యాన్ ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్‌లోని బాత్‌రూమ్‌లో ప్ర‌ద్యుమాన్ ఠాకుర్ అనే ఓ చిన్నారిపై లైంగిక దాడికి ప్ర‌య‌త్నించి, అది కుద‌ర‌క‌పోవ‌డంతో ఆ బాలుడిని దారుణంగా హ‌త్య చేసిన ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపిన విష‌యం తెలిసిందే. ఈ దారుణ ఘ‌ట‌న‌ను మ‌ర‌వ‌కముందే అదే న‌గ‌రంలో ఇటువంటిదే మ‌రో ఘ‌ట‌న చోటు చేసుకుంది. మాల్వియా న‌గ‌ర్‌లోని సంత్ నిరంకారి ప‌బ్లిక్ స్కూల్‌లో ఒక‌టో త‌ర‌గ‌తి విద్యార్థినిపై ఆ పాఠ‌శాల‌లో హౌజ్ కీపింగ్ ప‌నిచేసే ఓ వ్య‌క్తి వికృతంగా ప్ర‌వ‌ర్తించాడు.

ఆ చిన్నారి పాఠ‌శాల‌లోని బాత్‌రూమ్‌లోకి వెళ్లిన స‌మ‌యంలో ఆమెను అస‌భ్యక‌రంగా తాకుతూ మృగాడిలా ప్ర‌వ‌ర్తించాడు. తీవ్రంగా భ‌య‌ప‌డిపోయిన ఆ చిన్నారి ఇంటికి వెళ్ల‌గానే ఈ విష‌యాన్ని త‌న త‌ల్లిదండ్రుల‌తో చెప్పింది. దీంతో వారు పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. నిందితుడు రాకేష్‌ను అరెస్టు చేసిన పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు.  

  • Loading...

More Telugu News