samantha: సమంతా! నిన్ను నాగ‌చైత‌న్య ఇబ్బంది పెడితే మాతో చెప్పు!: అభిమానుల సపోర్ట్

  • ట్విట్ట‌ర్ వేదిక‌గా త‌న అభిమానుల‌తో సమంత ముచ్చ‌ట
  • పెళ్ల‌య్యాక కూడా న‌టిస్తా
  • మీకు పుట్ట‌బోయే బిడ్డ‌కు గౌత‌మ్ మీన‌న్ అని పేరు పెడ‌తారా? అని అడిగిన ఫ్యాన్
  • నవ్వుతున్నట్లు ఎమోజీలు పెట్టిన సమంత

‘పెళ్ల‌య్యాక నాగ‌ చైత‌న్య నిన్ను ఏమ‌యినా ఇబ్బంది పెడితే చెప్పు స‌మంతా.. మ‌న శామ్ ఆర్మీ వ‌చ్చేస్తుంది’ అని ఓ అభిమాని హీరోయిన్‌ స‌మంతతో అన్నాడు. దీనికి స్పందించిన స‌మంత 'సో క్యూట్' అని రిప్లై ఇచ్చింది. ట్విట్ట‌ర్ వేదిక‌గా త‌న అభిమానుల‌తో ముచ్చ‌టించిన స‌మంత వారు అడిగే ప్ర‌శ్న‌ల‌కు ఓపిక‌గా స‌మాధానాలు చెప్పింది. ఈ సందర్భంగా ఓ అభిమాని పెన్సిల్‌తో వేసిన నాగ‌చైత‌న్య‌, స‌మంత చిత్రాన్ని పోస్ట్ చేశాడు. 'వావ్ థ్యాంక్యూ' అని స‌మంత పేర్కొంది. పెళ్ల‌య్యాక న‌టిస్తావా? అని ఓ అభిమాని అడిగిన ప్ర‌శ్న‌కు నటిస్తానని స‌మాధానం ఇచ్చింది.

‘పెళ్లి కూతురి ఆర్మీ అంతా కలిసి పెళ్లి చూడ‌డానికి గోవాకి వ‌చ్చేస్తుంది’ అని ఓ అభిమాని పేర్కొన్నాడు. నాగ చైతన్య, సమంత జంటగా నటించిన ‘ఏమాయ చేసావే’ సినిమాకు గౌతమ్ మీనన్ దర్శకుడన్న విషయం తెలిసిందే. దీనిని దృష్టిలో పెట్టుకుని, ‘మీకు పుట్ట‌బోయే బిడ్డ‌కు గౌత‌మ్ మీన‌న్ అని పేరు పెడ‌తారా?’ అని ఓ అభిమాని అడిగాడు.. దానికి స‌మంత న‌వ్వుతున్న‌ట్లు ఎమోజీలు పెట్టింది. ఈ సందర్భంగా పెళ్లి కూతురు సమంతకు అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.  

  • Loading...

More Telugu News