పవన్ కల్యాణ్: రాష్ట్రంలో పవన్ కల్యాణ్ పార్టీ జెండానే లేదు: మంత్రి పితాని
- మాకు ప్రధాన ప్రతిపక్షం వైసీపీయే
- పవన్ గురించి ఆలోచించే సమయం మాకు లేదు
తమకు ప్రధాన ప్రతిపక్షం వైసీపీయేనని, రాష్ట్రంలో పవన్ కల్యాణ్ పార్టీ జెండానే లేదు కాబట్టి, ఆయన గురించి ఆలోచించే సమయం తమకు లేదని మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జనసేన పార్టీ కార్యకర్తల గురించి నిర్మాణబద్ధంగా పవన్ కల్యాణ్ ఆలోచించడం లేదని అన్నారు.