బాలిక‌ మృతి: చెరువులో జారిపడి బాలిక‌ మృతి.. కాపాడ‌డానికి ప్ర‌య‌త్నించి మ‌రో ఇద్ద‌రు సైతం మృతి

  • శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం గుర్రాలపాలెం గ్రామంలో ఘటన
  • బ‌ట్ట‌లు ఉత‌క‌డానికి చెరువు వ‌ద్ద‌కు వెళ్లిన నాగమ్మ, శిరీష, దుర్గ
  • చెరువులో పడ్డ శిరీష.. కాపాడబోయి నాగమ్మ, దుర్గ మృతి

శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం గుర్రాలపాలెం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో జారిపడిన ఓ బాలిక‌ను కాపాడ‌డానికి ప్ర‌య‌త్నించిన మ‌రో ఇద్ద‌రు కూడా మృత్యు ఒడిని చేరారు. పూర్తి వివరాల్లోకి వెళితే, ఆ గ్రామానికి చెందిన నాగమ్మ(45) అనే మ‌హిళ త‌న‌ కూతురు శిరీష (13) తో పాటు బ‌ట్ట‌లు ఉత‌క‌డానికి చెరువు వ‌ద్ద‌కు వెళ్లింది. వారితో మ‌రో బాలిక‌ దుర్గ (16) కూడా ఉంది. స‌ర‌దాగా చెరువులో దిగిన శిరీష ప్రమాదవశాత్తు అందులో మునిగిపోయింది.

ఈ విష‌యాన్ని గుర్తించిన‌ ఆమె త‌ల్లి నాగమ్మ, బాలిక దుర్గ ఆమెను కాపాడ‌డానికి ప్ర‌య‌త్నించి నీట మునిగిపోయారు. ఈ ఘ‌ట‌న‌పై సమాచారమందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

  • Loading...

More Telugu News