renu desai: నా మాజీ భర్త గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు రేణు లేటెస్ట్ మెసేజ్

  • మీడియా, కొందరు వ్యక్తులు ఇష్యూ చేస్తున్నారు
  • నేను చాలా క్లియర్ గా ఉన్నాను
  • ఆ అభిప్రాయం నా వ్యక్తిగతం కాదు
  • భారత పౌరురాలిగానే మాట్లాడాను
  • మీ కుటుంబాల కోసం శ్రద్ధ పెట్టండి

తనపై తాజాగా వస్తున్న కామెంట్లపై పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ తన ఫేస్ బుక్ ఖాతాలో తాజాగా మరో పోస్టు పెట్టారు. "నిన్న నేను పెట్టిన పోస్టులో నా మాజీ భర్త అభిమానుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మీడియా, కొందరు వ్యక్తులు కలసి కల్యాణ్ అభిమానులకు, నాకూ మధ్య ఇష్యూ తెస్తున్నారు. నేను చాలా క్లియర్ గా రాశాను. ఈ పోస్టు నా పర్సనల్ ఇష్యూ గురించి కాదు. దేశ పౌరురాలిగా నా ఆలోచనను నేను పంచుకున్నాను.

మీ అందరికీ ఒకటే విన్నపం. మహిళలకు స్వేచ్ఛ, విద్య, ఆరోగ్యం గురించి ఆలోచించుకోండి. మీ అందరికీ అమ్మ, అక్క, చెల్లి ఉన్నారు. ఇది నా కోసం కాదు. వాళ్ల కోసం చేయండి. వారికి చదువుకునేటప్పుడు, పని చేసేటప్పుడు రక్షణ ఉందన్న భావన కలిగించండి. భావ ప్రకటనా స్వేచ్ఛను కల్పించండి. మీడియా చానల్స్ తమ పవర్ చూపిస్తూ, టీవీల్లో డ్రామాలు, అపార్థాలు కలిగించే కథనాలను ప్రస్తావించవద్దు. అందరూ తమతమ కుటుంబాలు, ఇళ్లల్లోని మహిళల కోసం ఒకటిగా కదలాలన్నదే నా అభిమతం. కృతజ్ఞతలు" అని పోస్టు పెట్టారు. 

renu desai
pavan kalyan
fans
  • Loading...

More Telugu News