mumbai blasts: ముంబైలో మరో మారణహోమానికి దావూద్ గ్యాంగ్ స్కెచ్?

  • ఫోన్ కాల్స్ ట్యాపింగ్ ద్వారా వెలుగు చూసిన కుట్ర
  • అనీస్ ఇబ్రహీం ద్వారా దాడులకు ప్లాన్
  • అలర్టైన ముంబై పోలీసులు
  • అనుమానితులను అదుపులోకి తీసుకుని, విచారణ

1993లో వరుస బాంబు పేలుళ్లతో ముంబైలో మారణహోమం సృష్టించి, వందలాది మంది ప్రాణాలను పొట్టనబెట్టుకున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్... మరోసారి ముంబైలో మారణహోమానికి స్కెచ్ వేసినట్టు ముంబై పోలీసులు చెబుతున్నారు. దావూద్ ముఖ్య అనుచరుడు అనీస్ ఇబ్రహీం ద్వారా దాడులు చేయాలని పథకం రచించారని అంటున్నారు.

దావూద్, అనీస్ ఇబ్రహీంల మధ్య ఫోన్ కాల్స్ ను ట్యాప్ చేయడంతో ఈ కుట్ర బయటపడిందని పోలీసులు తెలిపారు. ఈ కుట్ర బట్టబయలు కావడంతో ముంబై పోలీసులు అలర్ట్ అయ్యారు. దర్యాప్తును ప్రారంభించారు. 8 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రస్తుతం దావూద్ పాకిస్థాన్ లో ఉన్న సంగతి తెలిసిందే. అతన్ని అప్పగించాలంటూ భారత్ ఎన్నోసార్లు కోరినా... దావూద్ తమ దేశంలో లేడంటూ పాకిస్థాన్ బుకాయిస్తోంది. 

mumbai blasts
dawood ibrahim
anees Ibrahim
mumbai on alert
  • Loading...

More Telugu News