salman khan: ఈ ఫొటోలో స‌ల్మాన్ ఖాన్‌ను గుర్తించారా?

  • చిన్న‌ప్ప‌టి ఫొటోను షేర్ చేసిన అర్బాజ్ ఖాన్‌
  • సోద‌రుల‌తో చెల్లి కూడా ఉంది
  • వైర‌ల్‌గా మారుతున్న ఫొటో

బాలీవుడ్ న‌టుడు అర్బాజ్ ఖాన్ త‌మ సోద‌రుల చిన్న‌ప్ప‌టి ఫొటోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశాడు. ఇందులో స‌ల్మాన్ ఖాన్‌, అర్బాజ్ ఖాన్‌, సొహైల్ ఖాన్‌ల‌తో పాటు వారి చెల్లి అల్విరా ఖాన్ కూడా ఉంది. జుట్టు క‌త్తిరించుకుని, అబ్బాయిలాగే క‌నిపిస్తున్న ఆమెను గుర్తించ‌డానికి కొంత స‌మ‌యం ప‌డుతుంది. ఈ ఫొటోలో వ‌రుస‌గా స‌ల్మాన్ ఖాన్‌, అర్బాజ్ ఖాన్‌, అల్విరా ఖాన్‌, సొహైల్ ఖాన్ ఉన్నారు. ఇదే ఫొటోను స‌ల్మాన్ ఖాన్ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో కూడా షేర్ చేశాడు. `జ‌స్ట్ కొన్నేళ్ల క్రితం` అంటూ ఈ ఫొటోను ఆయ‌న షేర్ చేశారు. ఇప్పుడు ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారుతోంది. దీనికి వేల సంఖ్య‌లో లైకులు, రీట్వీట్లు వ‌స్తున్నాయి.

salman khan
arbaaz khan
alvira khan
sohail khan
viral pic
social media
twitter
  • Loading...

More Telugu News