top ten web: అక్కడికి ముక్కు మూసుకుని కూడా వెళ్లలేమంటున్న నెటిజన్లు

  • ఏది ఎక్కువ కంపు అని సర్వే చేసిన టాప్ టెన్స్ వెబ్ సైట్
  • కుక్క మలం కంపన్న నెటిజన్లు
  • 43 శాతం మంది కుక్క మలానికే ఓటు

ఎక్కడైనా దుర్గంధం వస్తే మన కడుపులో దేవుతుంది, కొంతమంది వాంతి కూడా చేసుకుంటారు. అయితే, ఈ దుర్గంధం ఎక్కువగా ఎందులో ఉంటుందని టాప్ టెన్స్' వెబ్ సైట్ ఒక ఓటింగ్ నిర్వహించింది. ఈ ఓటింగ్ లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెటిజన్లు పాల్గొన్నారు.

వీరిలో 43 శాతం మంది కుక్క మలమే అత్యంత దుర్గంధపూరితమని ఓటేశారు. ఆ తరువాత.. మనిషి వాంతి చేసుకునే సమయంలో వచ్చే వాసన అత్యంత దుర్గంధపూరితమని తెలిపారు. దీని తరువాత వెల్లుల్లి తిని బస్సులో ప్రయాణించే వ్యక్తి దగ్గర వచ్చే వాసన, కుళ్లిపోయిన కోడిగుడ్ల వాసన, పిల్లి మలం, పిల్లల డర్టీ డైపర్ లు అంత్యంత దుర్గంధపూరితమైనవని తెలిపారు. 

top ten web
survey
bad smell
world wide survey
  • Loading...

More Telugu News