Hyderabad: కరాచీ బేకరీ వివాదం: మోసమా.. పొరపాటా... సోషల్ మీడియాలో వైరల్!

  • ముందురోజు బ్రెడ్ తయారు చేసి తరువాతి రోజు తయారు చేసినట్టు స్టిక్కర్
  • 4వ తేదీన కొనుగోలు చేసిన బ్రెడ్ పై 5వ తేదీ ముద్రణ
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన బ్రెడ్
  • దాడులు చేసిన తూనికలు, కొలతలు శాఖ
  • 18 ఫుడ్ ఐటెమ్స్ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నట్టు గుర్తింపు, కేసులు నమోదు

హైదరాబాదుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పట్టణాల్లో కరాచీ బేకరీ గురించి తెలియని వారు ఉండరు. బేకరీ ఐటెమ్స్ కు కరాచీ బేకరీది పెట్టింది పేరు. అలాంటి కరాచీ బేకరీ బ్రెడ్‌ ప్యాకింగ్‌ పై ముద్రించిన తేదీ వివాదాస్పదమైంది. బంజారాహిల్స్‌ లోని కరాచీ బేకరి బ్రాంచ్ లో ఒక వినియోగదారుడు బుధవారం (4వతేదీ) కొనుగోలు చేసిన బ్రెడ్‌ ప్యాకెట్‌ షాకిచ్చింది. ఎందుకంటే ఆ బ్రెడ్ అక్టోబర్ 5న తయారు చేసినట్టు ఉంది. మూడు రోజుల్లోపు వినియోగించాలని ఉంది. దీంతో దానిని ఫోటో తీసిన వినియోగదారుడు, సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో అది వైరల్ అయింది.

ఇది తూనికలు కొలతల శాఖకు చేరడంతో కరాచీ బేకరీపై అధికారులు దాడులు చేశారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలోని 14 కరాచీ బేకరీ బ్రాంచిల్లో తనిఖీలు నిర్వహించారు. ఇందులోని నాలుగు బ్రాంచీల్లో 18 ఫుడ్‌ ఐటమ్స్‌ పై నిబంధనలకు విరుద్దంగా ఉన్నట్టు గుర్తించారు. అలాగే వాటి తేదీల్లో కూడా తేడాలున్నట్టు తెలిపారు. దీంతో వాటిపై కేసులు నమోదు చేశారు. దీంతో దిద్దుబాటు చర్యలు ప్రారంభించిన కరాచీ బేకరీ యాజమాన్యం ఫేస్ బుక్ ద్వారా స్పందించి, సిబ్బంది నిర్లక్ష్యంతో సమస్య తలెత్తిందని, మరోసారి జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపింది. 

  • Loading...

More Telugu News