పాండ్యా: పాండ్యాను కపిల్ దేవ్ తో పోల్చడం ఎంత మాత్రం కరెక్టు కాదు: సౌరవ్ గంగూలీ
- కపిల్ దేవ్ ఓ ఛాంపియన్
- మరో పది, పదిహేనేళ్ల పాటు టీమిండియాకు సేవలందిస్తే అప్పుడు కపిల్ తో పాండ్యాను పోల్చవచ్చు
- ఇకనైనా ఇలా పోల్చకండి: గంగూలీ
ఇటీవల జరిగిన క్రికెట్ మ్యాచ్ లలో టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన సత్తా చాటడంపై అటు అభిమానులతో పాటు ప్రస్తుత, మాజీ క్రికెటర్లు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. భారత్ కు తొలిసారిగా ప్రపంచ కప్ క్రికెట్ ను సాధించి తెచ్చిన నాటి కెప్టెన్ కపిల్ దేవ్ తో పాండ్యాను పోల్చే వరకు ఈ ప్రశంసలు వెళ్లాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందిస్తూ, పాండ్యా గొప్ప ఆటగాడేనని, జట్టు విజయం కోసం పరితపించే లక్షణాలు అతనిలో చాలా ఉన్నాయని అన్నాడు.
అయితే, దేశానికి ప్రపంచ కప్ సాధించి పెట్టిన కపిల్ దేవ్ ఓ ఛాంపియన్ అని, ఆయనతో పాండ్యాను పోల్చడం ఎంత మాత్రం కరెక్టు కాదని, ఇకనైనా ఇలా పోల్చడం ఆపేయాలని కోరాడు. ఒకవేళ పది లేదా పదిహేనేళ్ల పాటు టీమిండియాకు పాండ్యా సేవలందిస్తే.. అప్పుడు, కపిల్ దేవ్ తో అతన్ని పోల్చవచ్చని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం పాండ్యా ఆట తీరును ఎంజాయ్ చేయాలని, ఇదే ఫామ్ ను పాండ్యా కొనసాగించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిస్తున్నట్టు గంగూలీ చెప్పాడు.