ఎంపీ బన్సీలాల్ మహత్: గాంధీ జయంతి రోజున అమ్మాయిలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ
- ఓ పాఠశాలలో ఎంపీ బన్సీలాల్ మహత్ ప్రసంగం
- ఛత్తీస్ గఢ్ బాలికలు, యువతులు రెచ్చగొట్టేలా ఉంటారన్న ఎంపీ
- మండిపడుతున్న ప్రతిపక్ష పార్టీల నేతలు
ఛత్తీస్ గఢ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీ బన్సీలాల్ మహత్ (77) గాంధీ జయంతి రోజున ఓ పాఠశాలలో ప్రసంగిస్తూ ఆడపిల్లలపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. తమ రాష్ట్ర బాలికలు, యువతులు రెచ్చగొట్టేలా ఉంటారని ఆయన అన్నారు. రెజ్లింగ్ పోటీలు నిర్వహించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీల నేతలు మండిపడుతున్నారు. బాలికపై ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేసినందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బన్సీలాల్ మహత్ ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు తాను కూడా అక్కడే ఉన్నానని జనతా కాంగ్రెస్ నేత అమిత్ జోగి తెలిపారు.