హనీప్రీత్ ఏడుపు: కోర్టులో న్యాయమూర్తి ముందు బావురుమన్న హనీప్రీత్!
- హర్యానాలోని పంచకుల కోర్టులో హాజరు
- తనకే పాపం తెలియదన్న హనీప్రీత్
- ఆరు రోజుల పాటు పోలీస్ కస్టడీ
- డేరా బాబా ఆగడాలపై ప్రశ్నించనున్న పోలీసులు
అత్యాచారం కేసులో శిక్ష అనుభవిస్తోన్న డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సన్నిహితురాలు హనీప్రీత్ ఇన్సాన్‌ను నిన్న పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ రోజు ఆమెను హర్యానాలోని పంచకుల కోర్టులో హాజరుపర్చగా ఆమె కన్నీరు పెట్టుకుంది. ఆమెపై పోలీసులు దేశద్రోహం, డేరా బాబాను తప్పించే యత్నం కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుల్లో ఆమె కోర్టులో సమాధానం చెబుతూ తనకు ఏ పాపం తెలియదని వాపోయింది.
కాగా, కోర్టు ఆమెను ఆరు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించింది. డేరా బాబాతో ఆమెకున్న సంబంధం, ఆశ్రమంలో జరిగిన అరాచకాలు, హర్యానా, పంజాబ్‌లతో పాటు పలు రాష్ట్రాలో చెలరేగిన హింసపై పోలీసులు ఆమెను ప్రశ్నించనున్నారు.