సూసైడ్: హైదరాబాద్‌లో బీటెక్ మొద‌టి సంవత్సరం విద్యార్థి ఆత్మ‌హ‌త్య

  • కూకట్‌పల్లి అడ్డగుట్టలోని హాస్టల్ లో ఘటన
  • హాస్టల్ యజమాని త‌మ కుమారుడిని తిట్టాడంటోన్న తల్లిదండ్రులు
  • అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి అడ్డగుట్టలో బీటెక్ మొద‌టి సంవ‌త్స‌రం విద్యార్థి ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం క‌ల‌క‌లం రేపింది. ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఆ విద్యార్థి రమేష్.. డీఆర్‌కే ఇంజినీరింగ్ కాలేజీలో చ‌దువుకుంటూ హాస్ట‌ల్‌లో ఉంటున్నాడ‌ని పోలీసులు తెలిపారు. ఈ రోజు ఉద‌యం హాస్ట‌ల్ గ‌దిలోనే ఫ్యానుకు ఉరేసుకుని ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డ్డాడ‌ని చెప్పారు. ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న ర‌మేష్ త‌ల్లిదండ్రులు హాస్టల్ యజమాని త‌మ కుమారుడిని తిట్టాడ‌ని, అందుకే మ‌నస్తాపంతో తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడ‌ని అంటున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు.  

  • Loading...

More Telugu News