kcr: టీడీపీ నేత కొత్త తరహా ప్రచారం.. ఎన్టీఆర్, చంద్రబాబులతో పాటు కేసీఆర్ ఫొటో కూడా!

  • టీడీపీ నేత వినూత్న ప్రచారం
  • ఫ్లెక్సీలో కేసీఆర్ కు స్థానం
  • ఇంటింటికీ తెలుగుదేశం ప్రచారంలో కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఏపీలో కూడా అభిమానులు ఉన్నారు. తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్లినప్పుడు కానీ, ఇటీవల పరిటాల శ్రీరామ్ పెళ్లికి వెళ్లినప్పుడు కానీ ఆయనకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. పలు సందర్భాల్లో కేసీఆర్ కు ఏపీలో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. ఏపీలోని కొందరు నేతలకు కూడా కేసీఆర్ అంటే ప్రత్యేక అభిమానం ఉందనడంలో సందేహం లేదు.

తాజాగా ఓ టీడీపీ నేత పార్టీ ప్రచారంలో భాగంగా కేసీఆర్ ఫొటోను కూడా ఉపయోగించారు. ఇది ప్రజలను విశేషంగా ఆకర్షించింది. ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం వెలమవారిపాలెంలో ఈ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వెలమవారిపల్లెలో కేసీఆర్ ఫొటోను టీడీపీ నేతలు ఉపయోగించారు. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కు స్వాగతం పలుకుతూ స్థానిక సర్పంచ్ ప్రవీణ్ కుమార్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎన్టీఆర్, చంద్రబాబుతో పాటు కేసీఆర్ ఫొటోను కూడా పెట్టారు. 

kcr
telangana cm
Telugudesam
kcr photo in Telugudesam flexi
kcr flexi
  • Loading...

More Telugu News