bhuvanewar kimar: అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన భువనేశ్వర్ కుమార్!

  • డిన్నర్ డేట్ సీక్రెట్ రివీల్ చేసిన భువనేశ్వర్ కుమార్
  • ఆ ఫోటోలో ఉన్నది బెటర్ హాప్ అంటూ చెప్పిన భువీ
  • జోడీ బాగుందంటూ నెటిజన్ల కితాబులు

తన అభిమానులకు టీమిండియా స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ శుభవార్త చెప్పాడు. మే 11న తన ఇన్ స్టాగ్రాంలో ఒక ఫోటో పోస్టు చేసిన భువీ... 'డిన్నర్ డేట్ లో ఉన్నాను...త్వరలోనే సీక్రెట్ రివీల్ చేస్తాను' అని చెప్పాడు. దీంతో భువీ అభిమానులు 'ఐదు నెలలు గడుస్తున్నాయి. ఇంకా మీరు సీక్రెట్ చెప్పలేదు' అంటూ ప్రశ్నించడం మొదలు పెట్టారు.

దీంతో ఆ ఫోటోలో ఉన్నది తన 'బెటర్ హాఫ్' అంటూ, ఆమె పేరు నుపుర్ నాగర్ అని తాజాగా వెల్లడించాడు. ఇది భువనేశ్వర్ కుమార్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా, ఆ ఫోటోలో ఉన్న ఆమె పేరు నుపుర్ నాగర్ అని తెలుస్తోంది.  

bhuvanewar kimar
nupur nagar
dinner date
  • Loading...

More Telugu News