pawan kalyan: మళ్లీ పెళ్లి కావాలంటే 'పీకే సార్'నే చేసుకోండి!: రేణూదేశాయ్ కి పవన్ ఫ్యాన్స్ సలహా

  • సోషల్ మీడియాలో తన బాధను వ్యక్తం చేసిన రేణు దేశాయ్
  • పవన్ అభిమానులు సంకుచితమా? అంటూ ఆగ్రహం
  • పవన్ కల్యాణ్ నే మనువాడాలంటూ సూచనలు
  • అదే జరిగితే ఆనందిస్తామంటున్న పవర్ స్టార్ ఫ్యాన్స్

ఏడేళ్ల పాటు ఒంటరితనాన్ని అనుభవించిన తరువాత, తనకు జీవితంలో ఓ తోడు కావాలని అనిపిస్తోందని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూదేశాయ్ చేసిన వ్యాఖ్యలు ఆయన అభిమానుల్లో కలకలం రేపగా, వారు పెట్టిన 'హేట్ మెసేజ్'లపై రేణు సైతం తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. స్త్రీ, పురుష సమానత్వం ఎక్కడుందని, మగవాళ్లు ఎన్ని పెళ్లిళ్లయినా చేసుకోవచ్చా? అని అడుగుతూ రేణు తన ఫేస్ బుక్ పేజీలో పెట్టిన పోస్టు వైరల్ కాగా, పలువురు ఆమె నిర్ణయానికి మద్దతు పలుకుతున్నారు.

 ఇక పవన్ అభిమానులైతే మరో అడుగు ముందుకు వేసి, మళ్లీ పెళ్లి కావాలంటే 'పీకే (పవన్ కల్యాణ్) సార్' నే చేసుకోవాలని సలహా ఇస్తున్నారు. అదే జరిగితే అత్యధికంగా ఆనందించేది తామేనని చెబుతున్నారు. పవన్ కల్యాణ్ రేణును తిరిగి తీసుకురావాలని కూడా సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే కనిపిస్తోంది.

రేణూ దేశాయ్ ఎప్పుడు మాట్లాడినా, ఆమె మాటల్లో పవన్ పై ఉన్న ప్రేమ కనిపిస్తూనే ఉంటుందని, ఎంతో ఒంటరితనం అనుభవించిన తరువాతే, ఆమె ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చని, ఆమెను బాధించేలా కామెంట్లు పెట్టవద్దని మరికొందరు తోటి అభిమానులకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు.

pawan kalyan
renu desai
marriage
  • Loading...

More Telugu News