petrol: 2 రూపాయలు తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు... సోషల్ మీడియా ఎఫెక్ట్!

  • సోషల్ మీడియాలో పెట్రోల్, డీజిల్ పెరుగుదలపై ఆగ్రహం
  • 2 రూపాయల ఎక్సైజ్ సుంకం తగ్గించిన పెట్రోలియం కంపెనీల కన్సార్టియం
  • అంతర్జాతీయ మార్కెట్ లో తగ్గిన క్రూడ్ ఆయిల్ ధరలు

గతకొంత కాలంగా సోషల్ మీడియాలో పెట్రోల్, డీజిల్ ధరలపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్ ధరలను ఎందుకు తీసుకురాలేదంటూ పలువురు నెటిజన్లు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు, వివిధ దేశాల ధరల పట్టికలతో మనదేశంలోని పెట్రోల్, డీజిల్ ధరలను పోల్చుతూ పోస్టులు పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పెట్రోలియం కంపెనీల కన్సార్టియం లీటర్ పెట్రోలు, డీజిల్ పై 2 రూపాయల ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్టు తెలిపింది.  

petrol
diesel
price low
cost cut
  • Loading...

More Telugu News