శశికళ: శశికళకు ఎదురుదెబ్బ.. పెరోల్ దరఖాస్తు తిరస్కరణ!

  • అనారోగ్యంతో బాధపడుతున్న శశికళ భర్త 
  • భర్తను చూసేందుకు పెరోల్ దరఖాస్తు
  • కుదరదన్న కర్ణాటక జైలు అధికారులు

అక్రమాస్తుల కేసులో పరప్పణ అగ్రహారం జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళ పెరోల్ నిమిత్తం పెట్టుకున్న దరఖాస్తును కర్ణాటక జైలు అధికారులు తిరస్కరించారు. కాలేయ, మూత్ర పిండాల సమస్యలతో బాధపడుతూ చెన్నై ఆసుపత్రిలో చేరిన తన భర్తను చూసే నిమిత్తం పదిహేను రోజుల పాటు పెరోల్ ఇవ్వాల్సిందిగా తన దరఖాస్తులో శశికళ కోరారు. ఈ దరఖాస్తును పరిశీలించిన జైలు అధికారులు పెరోల్ ఇచ్చేందుకు తిరస్కరించారు. కాగా, అక్రమాస్తుల కేసులో గత ఫిబ్రవరి నుంచి శశికళ సహా ఆమె బంధువులు ఇళవరసి, సుధాకరన్ జైలు శిక్ష అనుభవిస్తున్నారు.

  • Loading...

More Telugu News