సమంతా: సమంత వెరీ స్పెషల్ గర్ల్: అక్కినేని నాగార్జున
- పాత్రికేయులతో మాట్లాడిన నాగ్
- ‘సమంత మాకు లభిస్తున్న కానుక’ అన్న నాగార్జున
సినీ ప్రేమ జంట నాగచైతన్య-సమంత వివాహ వేడుకలు ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు జరగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నాగచైతన్య తండ్రి అక్కినేని నాగార్జున పాత్రికేయులతో మాట్లాడారు.
‘సమంత వెరీ స్పెషల్ గర్ల్. చాలా బాగా మాట్లాడుతుంది.. ఆమెను అభిమానిస్తాం. సినీ రంగంలో ఎవరి సాయం లేకుండానే ఎంతో కష్టపడి ఎదిగింది. వెరీ స్మార్ట్, వెరీ ఇంటెలిజెంట్... ఆమె మాకు లభిస్తున్న కానుక’ అని నాగార్జున చెప్పుకొచ్చారు.