brahmi: అమెరికాలో బ్రహ్మానందంకి అరుదైన గౌరవం!

  • 12వ సౌత్ ఏషియన్ ఫిలిం ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి గౌరవ అతిథిగా బ్రహ్మానందం
  • బ్రహ్మానందంను సత్కరించనున్న యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ సౌత్ ఏషియా సెంటర్ 
  • ఇప్పటివరకు ఈ గౌరవాన్ని పొందిన నటుడు ఎస్వీ రంగారావు మాత్ర‌మే
  • ప్రస్తుతం అమెరికాలోనే ఉన్న బ్రహ్మానందం

అమెరికాలోని సియాటెల్ నగరంలో ఈ నెల 6న‌ జరగ‌నున్న‌ తస్వీర్ 12వ సౌత్ ఏషియన్ ఫిలిం ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి గౌరవ అతిథిగా హాజరుకావాలని ప్రముఖ హాస్య‌నటుడు బ్రహ్మానందంకి నిర్వాహ‌కులు ఆహ్వానం పంపారు. ఇదే వేదికపై ఈ నెల‌ 7న యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ సౌత్ ఏషియా సెంటర్ బ్రహ్మానందంని ఘనంగా సన్మానించనుంది. ఇప్పటి వరకు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ఈ గౌరవాన్ని పొందిన నటుడు ఎస్వీ రంగారావు మాత్ర‌మే. ఆ తర్వాత బ్రహ్మానందం నిల‌వ‌నున్నారు. 1964 జకార్తా చిత్రోత్సవాల్లో నర్తనశాల చిత్రానికి గాను ఉత్తమ క్యారెక్టర్ యాక్టర్ గా ఎస్వీఆర్ అవార్డు పొందారు.

 ఆ తర్వాత తిరిగి ఇన్నేళ్లకు ఒక తెలుగు నటుడి విశేష ప్రతిభకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ద‌క్క‌డం ఇదే మొద‌టిసారి. ప్రస్తుతం న‌టుడు మంచు విష్ణు హీరోగా రూపుదిద్దుకుంటోన్న‌ 'ఆచారి అమెరికా యాత్ర' షూటింగ్ నిమిత్తం అమెరికాలోనే షూటింగ్ లో ఉన్న బ్రహ్మానందం.. ఈ ఆహ్వానానికి అంగీకారం తెలిపారు. 'నిన్ను కోరి' చిత్రం తర్వాత 'ఆచారి అమెరికా యాత్'ర చిత్రానికి అమెరికా లో లైన్ ప్రొడక్షన్ చేస్తున్న పీపుల్ మీడియా సంస్థ అధినేత టీజీ విశ్వ ప్రసాద్ మీడియాకు ఈ వార్త తెలియజేస్తూ హర్షం వ్య‌క్తం చేశారు. ఈ అంతర్జాతీయ పురస్కారానికి బ్రహ్మానందం అర్హుడని కొనియాడారు.  

  • Loading...

More Telugu News