జగన్: జగన్ సీఎం కావాలని కోరుకున్నా: 'రొట్టెల పండగ'లో వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్

  • రొట్టెల పండగలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే
  • ప్రత్యేక రొట్టెను అందుకున్న వైనం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నట్టు రొట్టెల పండగలో పాల్గొన్న నెల్లూరు నగర వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. బారాషహీద్ దర్గా స్వర్ణాల చెరువులో ప్రత్యేక రొట్టెను అందుకున్నారు. కాగా, మత సామరస్యానికి ప్రతీక అయిన రొట్టెల పండగ నెల్లూరులో ప్రసిద్ధి చెందిన బారాషహీద్ దర్గాలో మూడు రోజుల క్రితం ప్రారంభమైంది. ఈ పండగ సందర్భంగా భక్తులు తమ కోర్కెలు నెరవేరడానికి రొట్టెలను కొనుగోలు చేసి, అదే కోరికను అప్పటికే తీర్చుకున్న వారితో వాటిని మార్పిడి చేసుకోవడం ఆనవాయతీగా వస్తోంది.

  • Loading...

More Telugu News