hani preet: 'తండ్రి తన కుమార్తెను ప్రేమగా ముట్టుకోకూడదా?' అంటున్న హనీ ప్రీత్ సింగ్

  • మా విషయంలో మీడియా అవాస్తవాలు ప్రచురించింది
  • తెరముందుండాలని నేనెప్పుడూ ప్రయత్నించలేదు
  • న్యాయస్థానాలపై నమ్మకం ఉంది

తనపై మీడియాలో వస్తున్న వార్తలన్నీ అబద్ధమేనని డేరా సచ్ఛా సౌధా మాజీ చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్ దత్తపుత్రిక హనీ ప్రీత్ సింగ్ తెలిపింది. గత 37 రోజులుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న ఆమె జాతీయ మీడియాతో మాట్లాడింది. ఈ నేపథ్యంలో తనపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయని తెలుసుకుని ఆశ్చర్యపోయానని చెప్పింది.

ఓ తండ్రి తన కుమార్తెను ప్రేమగా ముట్టుకోకూడదా? అని ప్రశ్నించింది. తమ ఇద్దరి విషయంలో మీడియా అసత్యకథనాలు ఎందుకు ప్రసారం చేస్తోందని ఆమె ప్రశ్నించింది. సినిమా స్టార్ అయ్యేందుకే తాను గుర్మీత్ శిష్యురాలిగా మారిందని వచ్చిన ఆరోపణలపై కంటతడిపెట్టుకుంది. తానేనాడు కెమెరా ముందు ఉండాలని కోరుకోలేదని తెలిపింది. న్యాయస్థానాలపై నమ్మకం ఉందని, న్యాయస్థానం ఎదుట లొంగిపోతానని ఆమె తెలిపింది. నేపాల్ పారిపోయానన్న వార్తల్లో వాస్తవం లేదని ఆమె స్పష్టం చేసింది. 

hani preet
dera bab
hanipreet
delhi
police
  • Loading...

More Telugu News