pavan kalyan: పవన్ కల్యాణ్ పేరు మార్చుకున్నాడా? గూగుల్ లో కొట్టగానే అలా చూపిస్తోందెందుకు?

  • గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో పవన్ కల్యాణ్ పేరు మార్పు
  • అయోమయానికి గురవుతున్న అభిమానులు, కార్యకర్తలు
  • పవన్ కల్యాణ్ కొత్త సినిమాలో పాత్ర పేరా? అన్న అనుమానం

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పేరు మార్చుకున్నాడా? అన్న అనుమానం గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో ఆయన పేరు టైప్ చేసిన వారందరికీ కలుగుతోంది. పవన్ కల్యాణ్ పేరు గూగుల్ సెర్చ్ ఇంజన్ లో టైప్ చేసిన వెంటనే కుడిచేతివైపు ఆయన వికీపీడియా కనిపించే దగ్గర కుషాల్ బాబు అని కనిపిస్తోంది. దీంతో పవన్ కల్యాణ్ తన పేరు ఎప్పుడు మార్చుకున్నాడని అంతా ఆశ్చర్యపోతున్నారు.

ప్రధానంగా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్, జనసేన కార్యకర్తల్లో అయోమయం పెరిగిపోయింది. ఈ విషయంలో జనసేన కార్యాలయాన్ని సంప్రదించగా అలాంటిదేమీ లేదని సమాధానమిచ్చారు. అయితే ఈ పేరు పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న సినిమాలో అతను ధరించే పాత్ర పేరా? అన్నది తెలియాల్సి ఉంది. పవన్ కల్యాణ్ కు సంబంధించిన వివరాలన్నీ సరిగ్గా చూపిస్తున్న గూగుల్ సెర్చ్ ఇంజిన్ కేవలం పవన్ పేరునే కుషాల్ బాబుగా ఎందుకు చూపిస్తోందని పలువురు వీరాభిమానులు జట్టుపీక్కుంటున్నారు. 

pavan kalyan
kushal babu
power star
google search engine
  • Loading...

More Telugu News