: ఇక మీ ఓటుకు రశీదు


వస్తువు అమూల్యం.. ఓటు ఇంకా అమూల్యం. దుకాణంలో వస్తువు కొన్న వెంటనే బిల్లు ఇస్తారు. మరి ఓటు వేసినప్పుడు ఏదీ రశీదు..? అవునవును ఓటుకు కూడా రశీదు కావాలనే డిమాండ్లు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఈ విధానాన్ని త్వరలోనే ఎలక్షన్ కమిషన్ అమలు చేయనుంది. పోలింగ్ బూత్ లో ఓటు వేసిన వెంటనే ప్రింటర్ ద్వారా రశీదు వచ్చేస్తుంది. తమ ఓటు పడాల్సిన అభ్యర్థికే పడిందా? లేదా? అన్నది సరి చూసుకోవడానికి వీలుంటుంది. ఒక వేళ తప్పుగా ఓటేస్తే దానిని మార్చడానికి ఎలక్షన్ కమిషన్ అనుమతిస్తుందా? లేదా? అన్నది ఇంకా నిర్ణయం కాలేదు. అయితే ఈ రశీదు అక్కడ చూసుకోవడానికి మాత్రమే. ఇంటికి తీసుకెళ్లనివ్వరు. ప్రస్తుతానికి ఈసీ 250 ప్రింటర్లకు ఆర్డర్ ఇచ్చింది. అవి వస్తే ప్రయోగాత్మకంగా పరీక్షించాలని చూస్తోంది. ఈ నూతన విధానంపై ఎలక్షన్ కమిషన్ ఈ నెల 10న రాజకీయ పార్టీలతో సమావేశం కానుంది. వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించిన అనంతరం అవసరమైతే మార్పులు చేస్తుంది.

  • Loading...

More Telugu News