tajmahal: తాజ్ మహల్ ను విస్మరించి... మరో వివాదంలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం

  • తాజ్ మహల్ ను విస్మరించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం
  • పర్యాటక స్థలాల జాబితా నుంచి తొలగించిన యూపీ ప్రభుత్వం
  • మత ప్రాతిపదికన చూడకూడదంటూ విమర్శలు

ఉత్తరప్రదేశ్ లోని యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం మరో వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచింది. గోరక్షకుల దాడులు, గోరఖ్ పూర్ ఆసుపత్రుల్లో చిన్నపిల్లల మరణాలతో వివాదాస్పదమైన బీజేపీ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన పర్యాటక శాఖ బులెటిన్ పుస్తకంలో ప్రపంచంలోని అద్భుత కట్టడాల్లో ఒకటైన తాజ్‌ మహల్‌ కు స్థానం కల్పించకుండా వివాదం రేపింది. సమాధి పర్యాటక ప్రాంతమేంటంటూ గతంలో ఆదిత్యనాథ్ తాజ్ మహల్ పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే మత ప్రాతిపదికన ఉత్తరప్రదేశ్ ప్రముఖ పర్యాటక స్థలాల జాబితాలో దానికి స్థానం కల్పించలేదని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. దీంతో దిద్దుబాటు చర్యలకు రంగంలోకి దిగిన పర్యాటక శాఖ...ఎక్కడో తప్పు జరిగిందని పేర్కొంది. యూపీ పర్యటక శాఖ విడుదల చేసిన సందర్శనీయ స్థలాల బుక్ లెట్ లో యోగి ఆదిత్యనాథ్‌ సొంత నియోజకవర్గమైన గోరఖ్‌ పూర్‌ కు చెందిన ఆలయానికి స్థానం కల్పించిన అధికారులు, తాజ్ మహల్ ను పట్టించుకోకపోవడం విశేషం.

ఈ నేపథ్యంలో తాజ్ మహల్ ను పర్యాటక ప్రాంతంగా కాకుండా మతప్రాతిపదికన చూస్తోందని విపక్షాలు మండిపడుతున్నాయి. దీంతో మంత్రి సిద్ధార్థ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ, తాజ్ విశిష్టతను తమ ప్రభుత్వం ఎప్పుడో గుర్తించిందని, త్వరలో ఆగ్రాలో అంతర్జాతీయ విమానాశ్రయం కూడా నిర్మించనున్నామని తెలిపారు. 

  • Loading...

More Telugu News