sruthi hassan: అవకాశాలు రావేమోననే భయం లేదు : శ్రుతి హాసన్

  •  తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో శ్రుతి హాసన్ కి క్రేజ్
  •  ఈ మధ్యకాలంలో తగ్గుతోన్న అవకాశాలు 
  •  భయం లేదంటున్న శ్రుతి హాసన్
  •  తనకి చాలా విద్యలు తెలుసంటూ సమాధానం      

తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో శ్రుతి హాసన్ కి ఎంతో క్రేజ్ వుంది. గ్లామర్ పరంగాను .. నటన పరంగాను మంచి మార్కులు కొట్టేసిన శ్రుతి హాసన్, వేగంగా సినిమాలు చేయలేకపోతోంది. సక్సెస్ లు పలకరించినా ఆ సక్సెస్ లను ఉపయోగించుకుని ఆమె మరిన్ని సినిమాలు ఒప్పుకున్న సందర్భాలు లేవు. ఈ నేపథ్యంలో శ్రుతి హాసన్ చేతిలో పెద్దగా సినిమాలు లేకుండా పోయాయి.

 అవకాశాలు తగ్గాయా? .. సినిమాలు తగ్గించుకున్నారా? అనే ప్రశ్న తాజాగా ఆమెకి ఎదురైతే, "అవకాశాలు తగ్గలేదు .. నేను తగ్గించుకోను లేదు" అంటూ సమాధానమిచ్చింది. తనని తాను రీ ఛార్జ్ చేసుకోవడానికి ఈ సమయం తనకి బాగా పనికివస్తుందని చెప్పింది. అవకాశాలు రావేమోనని భయపడటానికి తనకి తెలిసింది నటన ఒకటి మాత్రమే కాదనీ .. చాలా తెలుసని అంది. అభిమానులకు దూరమవుతున్నాననే విషయాన్ని శ్రుతి హాసన్ పెద్దగా పట్టించుకోకపోవడం వాళ్లకి నిరాశను కలిగించే విషయమే.    

sruthi hassan
  • Loading...

More Telugu News