hydarabad: భారీ వర్షం ఎఫెక్ట్... నేడు హైదరాబాదులో విద్యాసంస్థలు, కార్యాలయాలకు సెలవు!

  • పది నుంచి పదమూడు సెంటీమీటర్ల వర్షపాతం 
  • గత పదేళ్లలో ఇదే రికార్డు స్థాయి వర్షం 
  • నేడు భారీ వర్ష సూచన.. పిడుగులు పడే అవకాశం
  • నేడు హైదరాబాదులో సెలవు

హైదరాబాదును భారీ వర్షం  ముంచెత్తింది. నిన్న సాయంత్రం 4:30 నిమిషాలకు ప్రారంభమైన వర్షం ఎడతెరిపిలేకుండా కురిసింది. చిన్నగా మొదలైన వాన తీవ్రరూపం దాల్చింది. గాలులుతో కూడిన వర్షం హైదరాబాదుకు విద్యుత్ సరఫరా లేకుండా చేసింది. సుమారు పది నుంచి పదమూడు సెంటీమీటర్లమేర కురిసిన వర్షం ధాటికి హైదరాబాదు అతలాకుతలమైంది. సుమారు 40 ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నగర వ్యాప్తంగా రోడ్లపై నీరు చేరింది. నాలాలు పొంగిపొర్లాయి.

కొన్ని చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. గత పదేళ్లలో అత్యధిక వర్షపాతం ఇదే కావడం విశేషం. ఇంత తీవ్రమైన వర్షాన్ని ఈమధ్య కాలంలో చూడలేదని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ముందు జాగ్రత్త చర్యగా నేడు విద్యాసంస్థలు, కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. ప్రైవేటు సంస్థలు కూడా సెలవు తీసుకోవాలని సూచించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సహాయకచర్యలు ప్రారంభించామని చెప్పారు. వర్షంతో పాటు పిడుగులు పడే అవకాశం కూడా ఉందని తెలిపారు. 

  • Loading...

More Telugu News