ఖైరతాబాద్: ఖైరతాబాద్ నుంచి పంజాగుట్ట వైపు వెళ్లే వాహనాల నిలిపివేత!

  • భారీ వర్షం ఎఫెక్ట్
  • పలు మార్గాల్లో వెళ్లే వాహనాలనూ నిలిపివేసిన పోలీసులు
  • చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ దగ్గర 2 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు

హైదరాబాద్ లో ఎడతెరిపి లేని వర్షం కారణంగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఖైరతాబాద్ నుంచి పంజాగుట్ట, పంజాగుట్ట నుంచి గ్రీన్ ల్యాండ్స్, ప్యాట్నీ నుంచి బాటా, ప్యారడైజ్ నుంచి రాణీగంజ్, సీబీఎస్, పుతిలిబౌలి వైపు వెళ్లే వాహనాలను ట్రాఫిక్ పోలీసులు నిలిపివేశారు. అఫ్జల్ గంజ్ నుంచి మొజాం జాహీ మార్కెట్ మార్గంలో ట్రాఫిక్ స్తంభించిపోగా, చాంద్రాయణగుట్ట ఫైఓవర్ దగ్గర 2 కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోయాయి. మాదాపూర్ పోలీస్ స్టేషన్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అవడంతో, అయ్యప్ప సొసైటీ వైపుగా వాహనాలను మళ్లించారు.

  • Loading...

More Telugu News