isis: 'అల్లాహో అక్బర్' అంటూ ఇద్దరు యువతులను దారుణంగా చంపేశాడు

  • 17, 20 ఏళ్ల యువతుల దారుణ హత్య
  • ఉగ్రవాదిని మట్టుబెట్టిన భద్రతాదళాలు
  • తమ పనే అని ప్రకటించుకున్న ఐసిస్

ఉగ్రదాడులతో ఫ్రాన్స్ వణికిపోతోంది. తాజాగా నిన్న మర్సీల్లే నగరంలో మరో ఉగ్రదాడి జరిగింది. సెయింట్ చార్లెస్ రైల్వే స్టేషన్ వద్ద ఓ ఉగ్రవాది 'అల్లాహో అక్బర్' అంటూ 17, 20 ఏళ్ల వయసున్న ఇద్దరు యువతులను దారుణంగా చంపేశాడు. నల్లటి దుస్తులు ధరించిన ఈ ముష్కరుడు ఓ యువతిని గొంతు కోసి హతమార్చాడు, మరో యువతి ఛాతీపై, కడుపులో కత్తితో పొడిచి చంపేశాడు.

ఈ నేపథ్యంలో అప్రమత్తమైన భద్రతా బలగాలు ఉగ్రవాదిని ఘటనా స్థలంలోనే కాల్చి చంపాయి. ఈ దాడికి తామే బాధ్యులమని ఐసిస్ ప్రకటించుకుంది. ఈ ఘటనకు పాల్పడింది తమ సభ్యుడేనని తెలిపింది. దాడికి పాల్పడిన ఉగ్రవాది వయసు 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుంది. అతను సాధారణ పాత నేరస్తుడేనని... అతని గురించి స్థానిక అధికారులకు తెలిసే ఉంటుందని కథనాలు వెలువడుతున్నాయి.

isis
terrorist attact in france
isis attack in france
  • Loading...

More Telugu News