పాండ్యా: ‘హే.. బ్రో.. ఆమె ఎవరు?’.. పాండ్యా సెల్ఫీపై నెటిజన్ల స్పందన
- ఓ యువతితో కలిసి పాండ్యా సెల్ఫీ
- ‘ఇన్ స్టా గ్రామ్’ ఖాతాలో పోస్ట్
టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఓ యువతితో కలిసి దిగిన ఫొటోను తన అభిమానులతో పంచుకున్నాడు. ఇన్ స్టా గ్రామ్ వేదికగా పోస్ట్ చేసిన ఈ ఫొటోలో పాండ్యా, ఆ యువతి నవ్వుతూ ఆ సెల్ఫీలో ఉన్నారు. అయితే, ఈ ఫొటోను పాండ్యా అభిమానులు ఫ్యాన్స్ పేజీలో పోస్ట్ చేశారు.
దీనిపై నెటిజన్లు స్పందిస్తూ, ‘హార్దిక్.. ఎవరీ అమ్మాయి?’, ‘హే బ్రో.. ఆమె ఎవరు?’, ‘ఆ గుడ్ న్యూస్ ఏంటో త్వరగా చెప్పెయ్?’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా, బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా విషయమై పాండ్యా ఇటీవల చేసిన ఓ ట్వీట్ పై నెటిజన్లు ఘాటుగా స్పందించారు. తాజా పోస్ట్ పై మాత్రం అభిమానులు గుడ్ న్యూస్ కోసం ఎదురుచూస్తున్నామంటూ స్పందించడం గమనార్హం.