అమెరికాలో కాల్పులు: అమెరికాలో కాల్పుల ఘటన: 20 మందికి పైగా మృతి, 100 మందికి పైగా గాయాలు

  • కొనసాగుతోన్న సహాయక చర్యలు
  • కాల్పులకు పాల్పడ్డ దుండగుడి హతం

అమెరికా లాస్‌వెగాస్‌లోని మాండలే బే హోటల్ లో మ్యూజిక్ కాన్సర్ట్ జరుగుతుండగా దుండగుడు కాల్పులు జ‌రిపిన విష‌యం తెలిసిందే. ఈ కాల్పుల్లో 20 మందికిపైగా మృతి చెందారు. 100 మందికిపైగా గాయాలపాల‌య్యారు. కాల్పుల‌కు పాల్ప‌డ్డ దుండ‌గుడిని అక్క‌డి పోలీసులు హ‌త‌మార్చిన‌ట్లు తెలుస్తోంది.

ఈ ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డ్డ వారిని పోలీసులు ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించారు. కాల్పుల శ‌బ్దంతో ఆ ప్రాంత‌మంతా ద‌ద్ద‌రిల్లి పోయింది. ప్రాణ భ‌యంతో అక్క‌డి వారు ప‌రుగులు తీశారు. ఈ ఘ‌ట‌న‌లో మృతుల సంఖ్య మ‌రింత పెర‌గ‌వ‌చ్చ‌ని అక్క‌డి అధికారులు భావిస్తున్నారు. దుండ‌గుడు ఈ కాల్పుల‌కు ఎందుకు పాల్ప‌డ్డాడన్న విష‌యం తెలియాల్సి ఉంది. 

  • Loading...

More Telugu News