shane warne: పాకిస్థాన్ బౌలర్ ను అధిగమించాలంటే కుల్దీప్ యాదవ్ కు ఉండాల్సింది ఇదే!: షేన్ వార్న్

  • కుల్దీప్ పై షేన్ వార్న్ ప్రశంసలు
  • ప్రపంచ మేటి లెగ్ స్పిన్నర్ యాసిర్ షాను ఢీ కొట్టే సత్తా కుల్దీప్ సొంతం
  • ఓపిగ్గా బౌలింగ్ చేస్తే అతనికి తిరుగుండదు

టీమిండియా చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ కు ప్రపంచ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ ప్రశంసలు లభించాయి. ప్రపంచ క్రికెట్ లో తన స్పిన్ తో ఎన్నో రికార్డులు నెలకొల్పిన షేన్ వార్న్ మాట్లాడుతూ, కుల్దీప్ యాదవ్ ఇదే జోరు కొనసాగిస్తే ప్రపంచంలో అత్యుత్తమ లెగ్ స్పిన్నర్ కాగలడని అన్నాడు. ఆస్ట్రేలియాపై బౌలింగ్ చేసినట్టే అన్ని ఫార్మాట్లలో కుల్దీప్ ఓపిగ్గా బౌలింగ్ చేస్తే అతనికి తిరుగుండదని అన్నాడు. చైనామన్ బౌలర్ (బంతిని ఎడమచేతి మణికట్టుతో గింగిరాలు తిప్పే బౌలర్) కావడంతో ప్రత్యర్థులను సులువుగా తికమకపెట్టి, బోల్తాకొట్టించగలడని షేన్ వార్న్ చెప్పాడు.

అయితే అందుకు ఓపిక చాలా అవసరమని తెలిపాడు. ప్రపంచ మేటి స్పిన్నర్ గా ఎదిగే సత్తా అతనిలో ఉందని వార్న్ అభిప్రాయపడ్డాడు. అంతే కాకుండా పాకిస్థాన్ లెగ్ స్పిన్నర్ యాసిర్ షాను ఢీ కొట్టే సత్తా కుల్దీప్ లో ఉందని వార్న్ తెలిపాడు. ప్రస్తుత క్రికెట్ లో యాసిర్ షా అత్యుత్తమ స్పిన్నర్ గా ఉన్నాడని గుర్తు చేశాడు. ఇదే జోరు కొంత కాలం కొనసాగిస్తూ, అన్ని ఫార్మాట్లలో ఓపికతో నిలకడగా బౌలింగ్ చేస్తే కుల్దీప్ వరల్డ్ బెస్ట్ లెగ్ స్పిన్నర్ కావడం ఖాయం అని వార్న్ తెలిపాడు. తాజా సిరీస్ లో హ్యాట్రిక్ నమోదు చేసిన కుల్దీప్ యాదవ్ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. 

shane warne
kuldeep yadav
china man bowler
yasir sha
  • Loading...

More Telugu News