lasvegas: లాస్ వెగాస్ మ్యూజిక్ కాన్సర్ట్ లో దుండగుడి కాల్పులు.. పరుగులు తీసిన ప్రజలు

  • అమెరికాలో కాల్పుల కలకలం
  • మండేలా బే కేసినోలో కాల్పులు
  • పలువురికి గాయాలు.. ఆసుపత్రికి తరలింపు 

అమెరికాలో కాల్పుల కలకలం రేగింది. లాస్ వెగాస్ లోని ఉత్తరప్రాంతంలో ఉన్న మండేలా బే కేసినోలో మ్యూజిక్ కాన్సర్ట్ ఏర్పాటు చేశారు. వీకెండ్ కావడంతో చాలా మంది దీనిని వీక్షించేందుకు వచ్చారు. మ్యూజిక్ కాన్సర్ట్ జరుగుతుండగా దుండగుడు కాల్పులు ప్రారంభించాడు. ఈ కాల్పుల్లో పలువురు గాయపడ్డట్టు తెలుస్తోంది. కాల్పుల శబ్దంతో అందులో పాల్గొన్న ప్రజలు బయటకు పరుగులు పెట్టారని సమాచారం.

ఈ సంఘటనపై మీడియా, సోషల్ మీడియాలో వార్తలు రావడంతో లాస్ వెగాస్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దుండగుడ్ని పట్టుకుంటామని ఎల్వీఎంపీడీ పోలీసులు తెలిపారు. అటువైపుగా ఎవరూ వెళ్లవద్దని కోరారు. అలాగే ఈ కేసినోకు దగ్గర్లో ఉన్న విమానాశ్రయానికి వచ్చే పలు విమానాలను దారిమళ్లించారు. విమానాశ్రయంతో పాటు  ఇతర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. 

lasvegas
Mandalay Bay Casino
gun fire
  • Loading...

More Telugu News