Hardik Pandya: మ్యాన్ ఆఫ్ ద సిరీస్ పాండ్యాకే.. అతడు ఎటువంటి ఆటగాడో చెప్పిన కోహ్లీ

  • టీమిండియాకు పాండ్యా పెద్ద ఆస్తి అన్న కెప్టెన్ 
  • భువీ, బుమ్రాలపైనా ప్రశంసలు

ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను భారత్ 4-1తో గెలుచుకుని సిరీస్‌ను కైవసం చేసుకుంది. టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు గెలుచుకున్నాడు. సిరీస్‌లో 222 పరుగులు చేయడమే కాకుండా ఆరు వికెట్లు తీసుకున్న పాండ్యాను కెప్టెన్ కోహ్లీ ప్రశంసల్లో ముంచెత్తాడు. నాగ్‌పూర్‌లో జరిగిన చివరి మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ పాండ్యాపై పొగడ్తల వర్షం కురిపించాడు.

హార్దిక్ పాండ్యా జట్టుకు గొప్ప ఆస్తిగా మారాడని కితాబిచ్చాడు. జట్టులోకి ఆటగాళ్లను ఎంపిక చేసే ప్రతిసారి తనకు తలనొప్పిగా ఉంటుందని, జట్టులో అందరూ మంచి ఆటగాళ్లనే తీసుకోవాల్సి ఉంటుందని తెలిపాడు. బౌలర్లు భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రాలను కూడా కోహ్లీ ఆకాశానికెత్తేశాడు. ఈ సిరీస్‌లో వారు చక్కని ప్రదర్శన కనబరిచారని కొనియాడాడు. ద్వైపాక్షిక సిరీస్‌లలో వరుసగా ఆరో సిరీస్ విజయాన్ని నమోదు చేయడం ఆనందంగా ఉందని కోహ్లీ చెప్పాడు. జట్టు ప్రదర్శన సంతృప్తికరంగా ఉందన్నాడు.

Hardik Pandya
biggest asset
Virat Kohli
  • Loading...

More Telugu News